చంద్రబాబు పై మోడీ విమర్శలు-ఏపీ Sun రైజ్ కాదు.. చంద్రబాబు Son రైజ్

0
4

తాను చేసిన తప్పులను కేంద్రంపై నెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మోదీ విమర్శించారు. చ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓడితాననే భయం పట్టుకుందని… అందుకే తన కుమారుడిని ఎలాగైనా రాజకీయాల్లో సెటిల్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రాన్ని సన్‌రైజ్ స్టేట్‌గా తీర్చిదిద్దుతామని చెబుతున్న చంద్రబాబు తన పుత్రుడిని(లోకేశ్) రైజ్ చేసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. గుంటూరు సభలో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌పై నేరుగా విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓడితాననే భయం పట్టుకుందని… అందుకే తన కుమారుడిని ఎలాగైనా రాజకీయాల్లో సెటిల్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

తాను చేసిన తప్పులను కేంద్రంపై నెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మోదీ విమర్శించారు. ఓ పక్క ఓటమి భయం, రాజకీయాల్లో కుమారుడి భవిష్యత్తు, దోచుకున్న ప్రజాధనాన్ని ఎలా దాచుకోవాలన్న భయాలతో చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్నో పథకాలకు కేంద్రం ఇస్తున్న నిధులకు ఇతర కార్యక్రమాలకు ఖర్చు పెట్టేసి నిధులివ్వడం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తామిచ్చిన ప్రతి పైసాకు లెక్కలు అడుగుతున్నందునే చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశారని తెలిపారు. 55నెలలుగా ఏపీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నామని మోదీ స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో తండ్రీ కొడుకుల రాజకీయం త్వరలోనే అంతం అవుతుందని మోదీ అన్నారు. కేంద్రం నుంచి ఎంత నిధులు వచ్చాయో లెక్క చెప్పమంటే చంద్రబాబాబు నోరు విప్పడం లేదన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించి దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ప్రత్యేక హోదాతో వచ్చే నిధుల కంటే ఏపీకి ఎక్కువగానే కేటాయించామన్నారు. చంద్రబాబు తనను తిట్టడం కంటే ముందు ఖర్చు పెడుతున్న డబ్బుకు వివరణ ఇవ్వాలని కోరారు. ఏపీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని ప్రధాని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here