దుమారం రేపే వ్యాఖ్యలు చేసిన చిరంజీవి – జనసేన పార్టీలో చేరిక ?

0
6

30 ఏళ్లకు పైగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో నెంబర్ 1 హీరోగా కొనసాగి ,స్వచ్చందంగా ప్రజా సేవ చెయ్యడానికి ప్రజా రాజ్యం పార్టీ పెట్టారు మెగా స్టార్ చిరంజీవి..కానీ కూటుల రాజకీయ నాయకులతో,బ్రష్టు పట్టిపోయిన మన రాజకీయ వ్యవస్థ మధ్య ,కుట్రలు కుతంత్రాల వల్ల చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ 2009 ఎన్నికలలో పరాజయం పాలు అయ్యింది..తర్వాత అనుకోని కారణాల వల్ల చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ ని కాంగ్రెస్ పార్టీ లో కలిపేశారు..2014 వరుకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న చిరంజీవి ఎన్నికల తర్వాత రాజకీయాలకు నెమ్మదిగా దూరమయ్యారు..ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కి తన సభ్యత్వం ని కూడా రద్దు చేసుకున్నారు ఆయన..అయితే చిరంజీవి రాజకీయాలకు దూరం అయ్యారు అని..త్వరలోనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ లో చేరబోతున్నారు అని సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి..యెల్లో మీడియా అయితే దీని పై అనేక ప్రత్యేక కథనాలు కూడా అల్లేశాయి..

అయితే ప్రచారం జరుగుతున్నా ఈ గాసిప్స్ కి తెర దించుతూ మెగా స్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేసాడు..ఇక అసలు విషయానికి వస్తే నిన్న రాత్రి తోట త్రిమూర్తులు కొడుకు పెళ్లి జరిగింది..ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి హాజరు అయ్యారు..అయితే చిరంజీవి హాజరు అయినా వెంటనే మీడియా అయినాను చుట్టూ ముట్టింది..ఒక్క విలేకరి జనసేన పార్టీ లో చేరబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి..ఇది నిజమేనా అని అడిగిన ప్రశ్నకి చిరంజీవి సమాధానమిస్తూ “నేను ఇక్కడకి పెళ్లిని చూడడానికి వచ్చాను..ఇలాంటి విషయాలు ఇక్కడ మాట్లాడడం సరి కాదు..నేను ప్రస్తుతం ఏ పార్టీలోనూ చేరడం లేదు..ప్రజా సేవ చెయ్యడానికి వచ్చిన నా తమ్ముడు పవన్ కళ్యాణ్ కి నా తరుపున నుండి మద్దతు లభిస్తుంది..కానీ నేను ప్రస్తుతం రాజకీయాలకు సంపూర్ణంగా దూరంగా ఉంటున్నాను..మిగిలిన న జీవితం సినిమాలకే అంకితం..దయచేసి సోషమీడియా లో వచ్చే అసత్య వార్తలను నమ్మొద్దు ” అంటూ సమాధానం ఇచ్చాడు ఆయన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here