బ్రహ్మి ఈజ్ బ్యాక్

0
5

టాలీవుడ్ ప్రముఖ టాప్ కమెడియన్ బ్రహ్మానందంకు ఇటీవల హార్ట్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. దేశంలోనే అత్యుత్తమమైన ముంబైలోని ‘ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్’లో గత నెల 14న ఆయనకు గుండె ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తయింది. దీంతో గత కొద్దికాలంగా ఆయన ఆస్పత్రిలోనే ఉండగా…ఇటీవలే హైదరాబాద్ చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఆయన్ని స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ పరామర్శించారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలుపుతూ కాస్తగా కామెడీగా ట్వీట్ చేశారు. ఐరన్ మ్యాన్.. బలమైన గుండె కలిగిన వ్యక్తి… హాస్య, నిర్భయం కలగలిసిన వ్యక్తి … నా కిల్ బిల్ పాండేను చూడటం సంతోషంగా ఉంది అంటూ ట్వీట్ చేశాడు. ఆయన మునుపటి లా చురుక్కా సినిమాలు చేయాలని, మరింత కాలం మనల్ని నవ్వించాలని ఆయన ఆకాంక్షించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here